calender_icon.png 16 January, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత నీటికి నిధులిస్తలేరు

16-01-2025 02:27:46 AM

  1. 2020లో ‘20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా’ పథకాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్ సర్కార్
  2. నాలుగేళ్లుగా లబ్ధిపొందుతున్న దాదాపు 8లక్షల మంది
  3. పథకానికి సంబంధించి జలమండలికి నిధుల విడుదలలో జాప్యం చేస్తున్న ప్రభుత్వం
  4. రూ.560కోట్లకు పైగా బకాయిలున్నట్లు సమాచారం

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15 (విజయక్రాంతి): గ్రేటర్‌వాసులకు ఉచిత నీటి సరఫరా కోసం 2020 డిసెంబర్ నుం  రాష్ట్ర ప్రభుత్వం ‘20వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకం’ను అమలు చేస్తోంది. అయి  ఈ పథకానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపో  జలమండలిపై నిర్వహణ భారం పడుతోంది.

జలమండలి పరిధిలోని దాదాపు 14లక్షల నల్లా నీటి క్యాన్ నంబర్లున్నా  వాటిలో దాదాపు 8లక్షల మందికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత నీటిపథకంతో జలమండలి ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తోంది. ఈ ఉచిత నీటి సరఫరా చేసినందుకు గాను ప్రభుత్వం జలమండలికి ప్రతి సంవత్సరం నిధులు మంజూరు చేయా  ఉంది.

అయితే నాలుగేండ్లుగా ఈ నిధు  సకాలంలో రావడం లేదు. దీని కారణంగా ప్రతినెల జలమండలికి వచ్చే ఆదా  ప్రభావం పడుతోంది. దీంతో ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు అను  నిధులు సమకూరకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభు  నుంచి జలమండలికి రావాల్సిన ఉచిత నీటి సరఫరా బకాయిల కోసం అధికారులు ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. 

కేటాయింపులో సగమే రిలీజ్

2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 20  ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత నీటి పథకానికి సంబంధించి జలమండలి అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,750 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం రూ.1,160 కోట్లను మా  కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే వాటిలోనూ కేవలం రూ.600కోట్లు మాత్ర  విడుదల చేయగా మిగిలిన రూ.560 కో  కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ స్కీం అమలు చేసినప్పటి నుంచి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.860కోట్లు కేటాయించగా.. అందులో రూ.350 కోట్లు మా  విడుదల చేసింది. అప్పటి నిధులే ఇంకా భారీగా బకాయిలున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.300 కోట్లు కేటాయించగా.. అందులో నుంచి రూ.250 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా దాదాపు 50 కోట్లు బకాయిలున్నా  రాష్ట్ర ప్రభుత్వం నుంచి జలమండలికి రావాల్సిన ఫ్రీ వాటర్ బకాయిలు మొత్తం కలిపి దాదాపు రూ.560కోట్లకు పైగా పెం  ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని వీలైనంత త్వరగా విడుదల చేయాలని అధి  కోరుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేళ ఫ్రీవాటర్ స్కీం అమలు

బీఆర్‌ఎస్ గత ప్రభుత్వం గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా 2020 డిసెంబర్‌లో నగరవాసులకు ఉచిత నీటి సరఫరా పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా దాదాపు 6.20లక్షల క్యాన్ నెంబర్లకు ప్రతినెల 20వేల లీటర్ల నీటిని జలమండలి ఉచితంగా సరఫరా చేస్తోంది. అలాగే 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీంను కొనసాగిస్తున్నప్పటికీ ఉచిత నీటి సరఫరా బిల్లులకు సంబంధించి  ప్రభుత్వ కేటాయింపులు తక్కువగానే ఉన్నట్లు తెలు  ఆ నిధులను కూడా రెగ్యులర్‌గా విడుదల చేయకపోవడంతో జల  ఆర్థిక భారం పడుతోంది. అయి   ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా జలమండలి అర్హులైన వారికి ఉచిత నీటిసరఫరా చేస్తుండడం గమనార్హం.