- మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో నిత్యం ఖాళీ కుర్చీలే దర్శనం
వ్యవసాయ మార్కెట్లో నిత్యం రైతుల తిప్పలు
పత్తి కొనుగోళ్ల విషయంలోనూ స్పందించని అధికారి
నాగర్ కర్నూల్, జనవరి 5 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో నిత్యం కాలి కూర్చిలే దర్శనమిస్తున్నాయి. పత్తి సాగు చేసిన రైతులు ఆయా పత్తి మిల్లులో అమ్మకాల కోసం అడిగాకులు తప్పడం లేదు. తేమ తరుగు పేరుతో మిల్లర్లు హిస్టారీతిగా దోచు కుంటున్న సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప త్తి అమ్మకాలు జరిపిన రైతులకు సైతం నేటి కీ డబ్బులు అందక రైతుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జిగా వ్యవహ రిస్తున్న జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి చిక్కడు దొరకడు అనే విధంగా ప్రజాప్రతి నిధులకు, రైతులకు కనీసం ఉన్నతాధికారు లకు కూడా అందుబాటులోకి రావడం లేద ని విమర్శలు ఉన్నాయి.
పత్తి కొనుగోలు స మయంలోనూ దళారులు పత్తి మిల్లర్లు కుమ్మక్కు తేమ, తరుగు పేరుతో రోజుల తరబడి పత్తి మిల్లుల వద్ద కడిగాపులు కాసిన అధికారులు ఎవరు స్పందించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ప్రాంతంలోనే అధికంగా పత్తి కొనుగోలు జరిగినప్పటికీ ఎక్కువ శాతం దళారులే రైతుల పేరుతో అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నా యి.
వీరికి సదరు అధికారి సంపూర్ణ సహ కారం అందించినట్లు రైతులు ఆరోపిస్తు న్నారు. జిల్లాలోని ఆయా మార్కెట్లలో రైతు ల పండించిన ఇతర ధాన్యం అమ్మకాలకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రని జిల్లా అధికారి పర్యవేక్షణ లోపం కార ణంగా అక్కడి కాంటాదారులు, దళారులు రైతులను నిండా ముంచుతున్నారని ఆరోప ణలు ఉన్నాయి. అయినప్పటికీ సదురు అధి కారి పట్టించుకోకపోవడం పట్ల కాంట దారులు మిల్లర్లతో లోపాయికారి ఒప్పం దాలు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపి స్తున్నాయి.
జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నా అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్వకుర్తి మార్కెటింగ్ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో కనపడిన అధికారి మళ్లీ ఒక్క రోజు కూడా విధుల్లోకి హాజరు కాలేదని చర్చ నడుస్తోంది. ఉన్నతాధికారులు స్పం దించి విధులకు డుమ్మా కొడుతున్న అధి కారిపై శాఖా పరమైన చర్యలు తీసుకో వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.