రోడ్డెక్కిన ‘కస్తూర్బా’ విద్యార్థులు
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఘటన
నారాయణపేట, ఆగస్టు 3 (విజయక్రాం తి): పురుగుల అన్నం తినలేమంటూ కస్తు ర్భా విద్యార్థులు నిరసన చేపట్టిన ఘటన సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో శనివారం జరిగింది. కోస్గి మండలం నాచారం గ్రామంలోని కస్తుర్భాగాంధీ పాఠశాలలో గత కొన్ని నెలలుగా భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపించారు. పాఠశాల ఎస్వోకు అనేకమార్లు తెలిపినా పట్టించుకోకుండా.. తమపైనే దురుసుగా ప్రవర్తిస్తున్న దని చెప్పారు.
విసుగుచెందిన విద్యార్థులు శనివారం మహబుబ్‌నగర్ రోడ్డుపై బైటాయించి ధర్నా చేపట్టారు. పాఠశాల ఎస్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా, కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా, హస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్న పాఠశాల ఎస్వోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల రాస్తారోకోతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయా యి. పోలీసులు, స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.