calender_icon.png 31 October, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 దాటినా ఆఫీసుకు రాలేరా?

04-07-2024 02:12:20 AM

  1. మళ్లీ సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతారు 
  2. ఇలాగైతే మీరు విధులేం నిర్వహిస్తారు
  3. తన పేషీలో సిబ్బంది తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): సచివాలయంలోని రోడ్లు, భవనాల శాఖ పేషీ, సెక్షన్‌లో ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడి పరిస్థితిని చూసి విస్మయం వ్యక్తం చేశారు. గైర్హాజరైన సిబ్బంది తీరును చూసి అవాక్కయ్యారు. సెక్షన్‌లో ఖాళీగా ఉన్న కుర్చీలను చూసి నిర్ఘాంతపోయారు. సెక్రటేరియట్‌లో ఉద్యోగుల పనితీరు గురిం చి తెలుసుకోడానికి వెళ్లిన మంత్రికి చాలా వరకు ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయి.

మంత్రి 11 గంటల సమయంలో అక్కడికి వెళ్లి అరగంట సేపు ఉన్నా అనేక మంది ఉద్యోగులు ఆఫీసుకు రాకపోవడంతో ఆగ్ర హం వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగులు ఉదయం 10 గంటలకు హాజరు కావా ల్సి ఉంటుంది. 11 అయినా రాలేదు.. మళ్లీ 4 లేదా 5 గంటలకు వెళ్లిపోతారు.. ఇలా అయితే మీరు డ్యూటీ ఏం చేస్తారంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

వందల కి.మీ. నుంచి వచ్చే వారి పరిస్థితేంటి

ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గంపెడాశతో సుదూరాల నుంచి సచివాలయానికి వస్తారని, మెజారిటీ ఉద్యోగులు కార్యాలయానికి సకాలంలో రాకుంటే పరిస్థితి ఏంటని మంత్రి ఉద్యోగులను ప్రశ్నిం చారు. పదేండ్లుగా మంత్రులు, సీఎంను  కలిసే అవకాశం లేక లక్షల మంది సమస్యలతో సతమతమవుతున్నారని, వారి ఇబ్బం దులు తీరాలంటే మనమంతా కలిసి పనిచేయాలని సిబ్బందితో పేర్కొన్నారు.

ప్రజలు మంత్రులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా అంతిమంగా సమస్య పరిష్కరించాల్సింది ఉద్యోగులేనని అన్నారు. ఉద్యోగుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వమూ విజయం సాధించదని, రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగుల కృషి అవసరమని తెలిపారు. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని కానీ ఇలా ఆలస్యంగా విధులకు రావడం సరికాదని హెచ్చరించా రు. పనివేళలు పాటించాలని ఆదేశించారు. ఎంత జీతం వస్తుందని ఓ ఉద్యోగిని మంత్రి ప్రశ్నించగా తడబడటంతో మీ జీతం వివరాలు కూడా మీకు తెలియదా, మీరెలా విధు లు నిర్వర్తిస్తారు అంటూ ఫైర్ అయ్యారు.