calender_icon.png 19 January, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయలు దొరుకుతలేవ్

07-07-2024 02:08:37 AM

  • శివారు ప్రాంతాల్లో మార్కెట్లు లేక ఇక్కట్లు
  • వారాంతపు సంతలే దిక్కు 
  • ఎల్బీనగర్‌లో పది లక్షల  జనాభా ఉన్నా రెండే రైతుబజార్లు

మినీ ఇండియాగా పేరుగాంచిన ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు కూరగాయల మార్కెట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు పది లక్షల జనాభా ఉన్న నియోజవకర్గంలో కేవలం కొత్తపేట, వనస్థలిపురంలో మాత్రమే రెండు రైతుబజార్లు ఉన్నాయి. హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో శివారు ప్రాంతాల ప్రజలకు వారాంతంపు సంతలే దిక్కు. సంత లేని రోజు కూరగాయలు దొరకని పరిస్థితి. శివారు ప్రాంతాల్లోనూ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

ఎల్బీనగర్, జూలై 6: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుమారు పది లక్షల జనాభా ఉన్నా వంట చేసుకునేందుకు అందుబాటు లో కూరగాయలు లభించడం లేదు. పది లక్షల జనాభా ఉన్న ఎల్బీనగర్‌లో కేవలం రెండు రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవి చుట్టుపక్కల కాలనీల ప్రజలకు మా త్రమే అందుబాటులో ఉండగా.. హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో శివారు ప్రాంతాలతో పాటు రైతుబజార్లకు దూ రంగా ఉన్న ప్రాంతాల్లో వారాంతపు సంతలే దిక్కుగా మారాయి. అవి కూడా అన్నిచోట్ల ఉండవు.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే సంతలు నిర్వహిస్తున్నారు. శివారు ప్రాం తాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా అందుబాటులో కూరగాయలు లభించడం లేదు. వారాంతపు సంతలు కూడా అందుబాటులో లేకపోవడంతో వనస్థలిపురం, కొత్తపేటలోని రైతుబజార్లకు రావాల్సిన పరిస్థితి. వారాంతపు సంత, రైతుబజారుల్లోనైతే తాజా కూరగాయలు లభిస్తాయి. ఇష్టమైన, నచ్చిన అన్నిరకాల కూరగాయలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ, రైతుబజార్లు లేకపోవడంతో శివారు ప్రాంత ప్రజలు స్థానికంగా దుకాణాల్లో నిల్వ ఉంచి న కూరగాయలను కొంటున్నారు. ప్రతిరోజూ ఒకే రకమైన కూరగాయలనే తినాల్సి వస్తుంది. వైద్యులు అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు తినాలని చెబుతున్నా ఎల్బీనగర్ శివారు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు దొరకని పరిస్థితి. 

కనుమరుగైన మార్కెట్లు

గతంలో కొన్ని ప్రాంతాల్లో ఏర్పా టు చేసిన కూరగాయల మార్కెట్లు నేడు కనుమరుగయ్యాయి. హయత్‌నగర్ పాత ఊరిలో గతంలో కూర గాయల మార్కెట్ ఉండగా.. నేడు అదే స్థలంలో వార్డు కార్యాలయం నిర్మించారు. ఇక్కడి మార్కెట్‌ను తరలిం చారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, రైతుబజార్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చే యాలని ప్రజలు కోరుతున్నారు.

అన్ని కూరగాయలు దొరకవు 

మా దగ్గర మార్కెట్ లేదు. దుకాణాల్లోనే కూరగాయలు కొంటాం. అక్కడ కూడా అన్ని రకాల కూరగాయలు అమ్మరు. ఒకటి, రెండు రోజుల్లో ఎవరూ కొనకుంటే పాడైపోతాయని దుకాణాల్లో ఆకుకూరలు, టమాటాలు అమ్మరు. అక్కడ దొరికిన వాటినే కొని రోజూ ఒకే రకమైన వంటకాలు తింటున్నాం. ఆకు కూరలు కొనాలంటే సంతకు పోవాల్సిందే. నాగోలు ప్రాంతంలో రైతుబజార్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

 వై అనిత, గృహిణి, నాగోలు

రైతు బజార్ ఏర్పాటు చేయాలి

నేను హయత్‌నగర్‌లో ఉంటున్నాను. ఇక్కడ కిరాణషాపుల్లోనూ కూరగాయలు దొరకవు. వారాంతపు సంతలోనే సరిపోయే కూరగాయలు కొంటున్నాం. హయత్‌నగర్‌లో రైతుబజార్ ఏర్పాటు చేయాలి. బయట మార్కెట్‌లో కిలోకు ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది. దుకాణాల్లో కేవలం గుడ్లు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు మాత్రమే అమ్ముతారు. సంతలోనే అన్నిరకాలు కూరగాయలు, ఆకు కూరలు కొంటున్నాం. 

చేర్యాల ఉమ, గృహిణి, హయత్‌నగర్