- నువ్వు ఓ చరిత్రహీనుడివి
- చిట్టి నాయుడివి.. బుల్లబ్బాయివి
- అధికారంలోకి వచ్చి పీకిందేమీలేదు
- ముఖ్యమంత్రి రేవంత్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తిట్ల దండకం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి)/శేరిలింగంపల్లి: ‘గత ప్రభుత్వాల్లో ఎందరో ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నాం. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య లాంటి వాళ్లను చూశాం. కానీ, రేవంత్‌రెడ్డి అంతటి దౌర్భాగ్యపు, చరిత్రహీనమైన సీఎంను ఎప్పడూ చూడలేదు’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరా మారావు విమర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని కేటీఆర్ శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల ఎస్కార్ట్‌తో వచ్చి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయటం దుష్ట సంప్రదాయమని అని ధ్వజమెత్తారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనీ.. అధికారం కోల్పోగానే నీక్కూడా ఇదే సంప్రదాయం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని సీఎంను హెచ్చరించా రు. ఫిరాయింపుల వ్యవహారంలో నెల రోజు ల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను హైకో ర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామా లు చోటు చేసుకున్నాయని వివరించారు. ఇదంతా రేవంత్‌రెడ్డి ఆడిన డ్రామా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఫ్యాక్షన్ లీడర్‌లాగా రోడ్డుపై వస్తుంటేని హౌస్ అరెస్టు చేయకుండా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కాపాడలేని రేవంత్‌రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని అన్నారు. ఈ తరహా దౌర్భాగ్యం గత పదేళ్లలో ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో ‘ఈ నగరానికి ఏమైంది? నెలలో 28 మర్డర్లు’ అని పత్రికలు కథనాలు రాస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కాపాడలేని సీఎం ఢిల్లీకి 22 స్లార్లు వెళ్లినా.. ఆయన పీకిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
ఫిరాయింపుదారుల్లో వణుకు
హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు గజగజ వణికిపోతున్నారని కేటీఆర్ అన్నారు. అనర్హత వేటు తప్పదన్న భయంతోనే తాము పార్టీ మారలేదంటూ కొత్త రాగం ఎత్తుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. ‘ఓ వైపు ఎమ్మెల్యేలంతా మా పార్టీలో చేరుతున్నారు... ఇక బీఆర్‌ఎస్ పార్టీ ఖతం అంటూ బాకాలు ఊదే మీడియాలో ప్రచా రం చేసుకుంటున్నారు. బెదిరింపులు, ప్రలో భాలతో మా ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి కండువాలు కప్పాడు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే రాజ్యాంగ విలువలను, పార్లమెంటరీ పద్ధతులను, సభా సంప్రదాయాలను తుంగలో తొక్కి ఎమ్మెల్యే గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకోవడం కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన విధానానికి నిదర్శనం. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల మీద దాడులు చేయిస్తున్నది సీఎం రేవంత్‌రెడ్డే. హరీశ్‌రావు సహా మరికొందర్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో తిప్పితే నీ జిల్లా ప్రజలే నీకు చుక్కలు చూపించారు. గాంధీకేమో డీసీపీ, ఏసీపీలతో పోలీ సు ఎస్కార్ట్ ఇచ్చి.. మా ఎమ్మెల్యేలు, నాయకులను హౌజ్ అరెస్టు చేశారు.
ఈ తరహా పద్ధతులు మంచిదో కాదో తెలంగాణ ప్రజ లు ఆలోచించాలి. బీఆర్‌ఎస్ బీఫాం మీద గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాజీనా మా చేయాలని కోరడంలో తప్పేముంది? రేవంత్‌రెడ్డిలా రాళ్లతో కొట్టండి, బొంద పెట్టండి అని కౌశిక్‌రెడ్డి మాట్లాడలేదు కదా? నీలా నీతిమాలిన మాటలు మాట్లాడటం ఎవరికీ సాధ్యంకాదు.’ అని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్‌లో ఉన్నవాళ్లంతా మా వాళ్లే..
రాష్ట్రం ఏర్పడిన పదేళలో ప్రాంతీయ విద్వేషాలకు చెందిన ఘటన ఒక్కటి కూడా జరగలేదని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రాంతీ య విద్వేషాల పంచాయితీ ఉండదని ముం దే చెప్పామని గుర్తుచేశారు. అందుకే హైదరాబాద్ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని అన్నారు. రేవంత్‌రెడ్డి పనికిమాలిన వ్యక్తి అని భావించి, ఆయనకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అందుకే రేవంత్‌రెడ్డి ప్రాంతీయ విద్వేషాలు నింపుకుని హైదరాబాద్ ప్రజలపై పగ బట్టారని విమర్శించారు.
మీడియాను మేనేజ్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు, వైఎస్, కిరణ్ కుమార్‌రెడ్డి, రోశయ్య లాంటి నాయకుల ముందు నువ్వు చిట్టినాయుడు వి. నీలాంటి బుల్లబ్బాయిలను చాలా మంది ని చూశాం. మమ్మల్ని ఏం చేయలేక ఏదో కొద్దిరోజులు పైశాచిక ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్నావ్ తప్ప, నీతో ఏం ఫరక్ పడదు’ అని తేల్చి చెప్పారు.
ఎంటిక కూడా పీకలేవు
‘రేవంత్‌రెడ్డీ.. నీవు ఎన్ని కుట్రలు చేసి నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మా ఎంటి క కూడా పీకలేవు’ అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదన్నర నెలల్లో చేసిం ది ఏమీ లేదని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీల డెడ్‌లైన్ దాటవేస్తూ గారడీ మాటలు చెప్తూ టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. ‘2 లక్షల ఉద్యోగాల పేరిట యువతను, రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని, మహిళలను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుంది. బజారు మాట లు, చిల్లర మాటలు, చిల్లర వేశాలు వేస్తుం ది కాంగ్రెస్ నాయకులే.
రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాల వల్ల ప్రజలకు రాజకీయా లు, రాజకీయ నాయకులంటేనే అసహ్యం వేస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.. ఇంకా వచ్చేవారి కోసం గేట్లు తెరిచామని చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? చరిత్రలో నీలాంటి పనికిమాలిన సీఎం, తలమాసిన వెధవను ఎవరినీ చూడలేదు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగినా చోద్యం చూసిన ఏసీపీ, సీఐలను వెంటనే సస్పెం డ్ చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశా రు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘గాంధీ.. గత ఎన్నికల్లో రూ.9500 కోట్ల తో అభివృద్ధి చేశానని చెప్పావు కదా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో శేరిలింగంపల్లికి అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకువచ్చి అభివృద్ది చేసి చూపించు. దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావు. ’ అని విమర్శించారు. కౌశిక్‌రెడ్డిని కలిసినవారిలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మాధవరం క్రిష్ణారావు, బాల్క సుమన్, శంభీపూర్ రాజు, అనిల్ జాదవ్, గణేష్ గుప్తా, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17తో బీజేపీకి సంబంధం లేదు
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్,సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణకు సెప్టెం బర్ 17న స్వాతంత్రం వచ్చిందని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. ఇండియన్ యూని యన్‌లో హైదరాబాద్ విలీనానికి, బీజేపీకి ఎలాంటి సంబం ధం లేదన్నారు. శనివారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ రజకార్ల హయాంలో సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం వల్లాలలో 8 మంది విద్యార్థులను కాల్చి చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో సెప్టెంబర్ 17న అమరవీరుల స్తూపం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు వీహెచ్ పేర్కొన్నారు. రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కంగనాపై పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు.
వ్యక్తిగత గొడవలను కాంగ్రెస్‌కు అంటగట్టొద్దు
పీసీసీ మీడియా కమిటీ కన్వీనర్ సామ రామ్మోహన్‌రెడ్డి
హైదరాబాద్,సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరి ఎమ్మెల్యేల వ్యక్తిగత గొడవలను కాంగ్రెస్‌కు అంటగట్టే ప్రయత్నం చేయొద్దని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావుకు పీఏసీ పదవి రాలేదనే అక్కసుతోనే పాడి కౌశిక్‌రెడ్డిని రెచ్చగొట్టి.. ఎమ్మెల్యే గాంధీ తో గొడవ పెట్టించారని ఆరోపించారు.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కౌశిక్‌రెడ్డి, హరీశ్‌రావులను పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే విదేశాలనుంచి రాగానే వరద బాధితులను పరామర్శించాల్సి ఉండేదని, కానీ నేరుగా కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లి రెచ్చగొట్టే మాటలు మాట్లాడారని మండిపడ్డారు.