calender_icon.png 26 October, 2024 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్స్ ముత్యం మన పాయల్!

21-05-2024 12:05:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ మూవీ

మూడు దశాబ్దాల తర్వాత ప్రసిద్ధ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ సినిమా తళుక్కుమంది. ప్రముఖ దర్శకు రాలు పాయల్ కపాడియా తీసిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని పామ్ డీ ఓర్ అవార్డుకు నామినేట్ అయ్యింది. అంతేకాకుండా విశ్వ వేదిక మీద ప్రదర్శితం కానుంది. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పటికి ఓ భారతీయ చిత్రం ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసింది. పాయల్ కపాడియా తన సినీ ప్రయాణాన్ని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ) నుంచి ప్రారంభించారు. ఆమె తీసిన ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ చిత్రం 2021లో ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికైంది. ఈ చిత్రంతో పాయల్ తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అత్యున్నత అవార్డుకు ఎంపికయిన పాయల్  తీసిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. రచయిత కథ రాయడం ఒక ఎత్తయితే, చిత్రంలోని పాత్రల ద్వారా కథ నడిపించ డం మరో ఎత్తు. ఎంతో నైపుణ్యతతో కథను నడిపించింది. చిత్రంలోని పాత్రల మధ్య సంభాషణలు, రచనా విధానం ఎంతో సందేశాత్మకంగా ఉంటాయి.

చిత్రంలోని విజువల్స్, కథ సాగేవిధానం ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి. పాయల్ విజయానికి తమ వంతుగా చిత్ర రచయిత వరుణ్ గ్రోవర్, లిరిసిస్ట్, ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కృషి చేశారు. పాయల్ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపును సొంతం చేసుకోవడమే కాదు. తన ఈ విజయం ఇంకా అవకాశాలను అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవేదికపై భారతీయ సినిమా గర్వంగా తలెత్తుకొనేందుకు ఈ చిత్రం ద్వారాలు తెరిచిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

1946లో కేన్స్‌లో నీచా నగర్ వహించి, గ్రాండ్ ప్రైజ్‌ని సొంతం చేసు కుంది. ఈ చిత్రానికి చేతన్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దాదాపు ముప్పు సంవత్సరాల తర్వాత 1994లో మలయాళం ఫిల్మ్‌మేకర్ షాజీ ఎన్ కరున్ ‘స్వహం’ కెన్నెస్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ ల్‌కు నామినేటెడ్ అయ్యింది. కేన్స్ అవార్డుకు భారతీయ చిత్రం మరోమారు నామినేట్ అవ్వడం గర్వకారణం.