calender_icon.png 22 September, 2024 | 1:49 AM

ట్రాక్టర్ ట్రాలీ కింద గంజాయి

21-09-2024 01:14:44 AM

రూ.85 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హనుమకొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో శుక్రవారం రూ.85 లక్షల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా వైరామవరం మండలం పాతకోటకు చెందిన కిలో లక్ష్మీనారాయణ ఈ నెల 17న ఒడిశా రాష్ట్రం చితరకొండ మండలానికి చెందిన నాటుగురు వద్ద 338 కిలోల గంజాయిని కొన్నాడు.

96 ప్యాకెట్లుగా మార్చి ట్రాక్టర్ ట్రాలీ కింద అమర్చి రవాణా చేస్తున్నాడు. గంజాయి ప్యాకెట్లను భద్రాచలం, ములుగు, హనుమకొండ, సిద్దిపేట మీదుగా కామారెడ్డికి చేరవేసే క్రమంలో హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్‌రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డాడు. ట్రాక్టర్‌ను తనిఖీ చేయగా ట్రాలీ కింద అమర్చిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి గంజాయితో పాటు ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుడ్ని గంజాయి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో పాటు మరో విక్రయదారుడు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీలు దేవేందర్‌రెడ్డి, నందిరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు. 

11లక్షల గంజాయి పట్టివేత

భద్రాచలం, సెప్టెంబర్ 20:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవా రం రూ.11 లక్షల విలువగల గంజాయిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. ఎక్పైజ్  ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకార  ం.. భధ్రాచలంలోని కూనవరం రోడ్డు ఆర్టీ చెక్‌కోస్టు వద్ద ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. ఒడిశా రాష్ట్రం నుంచి రాజస్థాన్‌కు కారు  లో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. ముఖేష్‌మిర్ధ, గుజ్జర్ శ్రీరామ్ అనే ఇద్దరి నుంచి రూ.11.30లక్షల విలువగల 45.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్టు చేశారు. రెండు సెల్‌ఫోన్‌లు, కారును సీజ్ చేశారు.