calender_icon.png 25 December, 2024 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రేతల అరెస్ట్

02-11-2024 01:50:23 AM

ఎల్బీనగర్, నవంబర్ 1: గంజాయి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నలుగురు వ్యక్తులు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి గురువారం హయత్‌నగర్‌లోని బావర్చి హోటల్ వద్ద విక్రయిస్తుండగా మహేశ్వరం ఎస్‌వోటీ, హయత్ నగర్ పోలీసులు దాడి చేశారు. నిందితుల్లో ఇద్దరు పారిపోగా, ఇద్దరు పోలీసులకు పట్టుపడ్డారు. వీరిలో ఒడిశాకు చెందిన నిశాంత్ బిస్వాన్, హైదరాబాద్‌కు చెందిన కమల్ ఉన్నారు.  హయత్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.