హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాకు చెందిన నవీన్ గౌడ్ (32) అనే డ్రగ్ పెడ్లర్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులకు అంది న విశ్వసనీయ సమాచారంతో జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద హాష్ ఆయిల్, వీడ్ ఆయిల్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకొని, అతడి నుంచి రూ. 4.22 లక్షల విలువైన 825 గ్రాముల హాష్ ఆయిల్, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నవీన్ గతంలో వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. జైల్లో ఉండగా అతడికి ఏపీలోని అరకు ప్రాంతానికి చెందిన గంజాయి గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ముఠా నుంచి ఎండు గంజాయి, హాష్ ఆయిల్ కొనుగో లు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు జంక్షన్లలో విద్యార్థులకు గంజాయి విక్రయించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపా రు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.