20-03-2025 05:43:09 PM
250 గ్రాముల ఎండు గంజాయి, బైక్ సీజ్..
మనోహరబాద్ (విజయక్రాంతి): గుట్టు చప్పుడు కాకుండా ఎండు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం మేజర్ పంచాయతీ కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలో సర్కార్ పార్థు అనే యువకుడు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పరిశ్రమలలో పనిచేస్తున్న కూలీలకు కొంత కాలం నుండి గంజాయి విక్రాయిస్తున్నడని సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం పారిశ్రామిక వాడలో మెరుపు దాడులు చేశారు. దీంతో సర్కార్ పార్థు అనే యువకుడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా అతని వద్ద ప్లాస్టిక్ కవర్ లో 250 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అతన్ని అరెస్టు చేసి ద్విచక్ర వాహనం హీరో స్పెండర్ ను సీజ్ చేసి రిమాండ్ కు తరలించామని మెదక్ ట్రాన్స్పోర్ట్ సిఐ భూపాల్ రెడ్డి తెలిపారు.