calender_icon.png 23 November, 2024 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్ప సీన్ రిపీట్ ...!

01-11-2024 12:04:57 PM

రాజమండ్రి నుండి ఎంపీకి ట్యాంకర్ లో గంజాయి తరలింపు 

72.50 లక్షల రూపాయల విలువ చేసే 290 కేజీల గంజాయి  స్వాధీనం

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయ క్రాంతి): పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు హీరో వివిధ పద్ధతుల ను అవలంబించిన సీన్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో రిపీట్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి నుండి మధ్యప్రదేశ్ కు అక్రమంగా ట్యాంకర్ లో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు పన్నిన పన్నాగం వాంకిడి పోలీసులు చేదించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర  సరిహద్దు చెక్ పోస్ట్ సమీపంలో వానాల తనిఖీ చేపడుతుండగా టాంకర్ ను పరిశీలించిన పోలీసులు డ్రైవర్ పరివర్తనను గమనించి తనిఖీ చేయగా అందులో భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. 

వాహనాన్ని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ డివి శ్రీనివాస్ రావు స్థానిక పోలీస్ స్టేషన్ లో  డి.ఎస్.పి కరుణాకర్ తో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను  వెల్లడించారు. రాజమండ్రి నుండి మధ్యప్రదేశ్ కు టాంకర్ లో 145 ప్యాకెట్లలో 290 కే జీ ల గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లు వెల్లడించారరు .విలువ 72.50 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో పోలీస్ నిఘా వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింద న్నారు. పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ అవుతున్న గంజాయి వాహనాన్ని పట్టుకున్న వాంకిడి సిఐ.ఎస్సై.సిబ్బందిని అభినందించారు.  గంజాయి వాహనాన్ని పట్టుకున్న విషయం తెలిసిన మల్టీ జోన్-1 అదనపు డీజీ చంద్రశేఖర్  ఎస్పీ శ్రీనివాస్ ను అభినందించారు.