హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలోని ఫతేనగర్‌లో వడ్డెర బస్తీ ప్రాంతంలో ఎస్టీఎఫ్ సిబ్బంది దాడులు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఎస్టీఫ్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఫతేపూర్‌లోని ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ అధికారులు బుధవారం సిబ్బందితో దాడులు చేయించారు. గంజాయి విక్రేతలు ముస్త ఫా హుస్సేన్, ఇస్లీ కవితను అరెస్ట్ చేశా రు.
వారి నుంచి 1.50 కిలోల గంజాయితో పాటు రూ.17వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ధూల్‌పేట్‌కు చెందిన గాయత్రి అనే మహిళ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు గాయత్రితో పాటు విక్రయాలతో ప్రమేయం ఉన్న వరలక్ష్మి పైనా కేసు నమోదు చేశారు.