చార్మినార్, జనవరి 8 (విజయ క్రాంతి): బండ్లగూడలోని ఓ కళా శాల విద్యార్థులకు గంజాయిని విక్ర యించేందుకు బుధవారం వెళ్లిన చందన్‌మాఝీ(36), బిజయతక్రి (51) అనే ఇద్దరు వ్యక్తులను సౌత్, ఈస్ట్ పోలీసులు, బండ్లగూడ పోలీ సులు సంయుక్తంగా దాడి చేసి పట్టు కున్నారు. వారి నుంచి రూ.3 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు బిస్వజిత్ చందన్ పరారీలో ఉన్నాడని తెలిపారు.