calender_icon.png 4 April, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి లేడీ డాన్ సంగీతా సాహూ అరెస్ట్

27-03-2025 12:00:00 AM

ఒడిశాకు వెళ్లి అరెస్ట్ చేసిన ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): గంజాయి లేడీ డాన్ సంగీతా సాహూను ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ పోలీసులు ఒడిశాకు వెళ్లి అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ హీరోయిన్‌లా పోస్టులు చేస్తూ.. గం జాయి వినియోగం ఉండే ప్రాంతాల కు వెళ్లి గంజాయి వ్యాపారులతో హోల్‌సేల్‌గా గంజాయి సరఫరా చేసేందుకు సంగీత ఒప్పందం కుదుర్చుకునేది. నగరంలోని సికింద్రాబాద్, ధూల్‌పేట్ సహా పలు ప్రాంతాల్లో నమోదైన గంజాయి కేసుల్లో సంగీత సాహు నిందితురాలిగా ఉంది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎస్‌టీఎఫ్ టీంలీడర్ నంద్యాల అంజిరెడ్డి పర్యవేక్షణలో ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యే క బృందాన్ని ఒడిశాలోని కాళీకోట్‌కు పంపారు. స్థానిక పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి బుధ వా రం తీసుకొచ్చారు. కాగా 2022లో సికింద్రాబాద్‌లో గంజాయి దొరికిన కేసులో ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చింది.