calender_icon.png 22 October, 2024 | 2:02 PM

మంథనిలో గంజాయి పట్టివేత..

22-10-2024 11:28:44 AM

5 గురు పై కేసు నమోదు మంథని ఎస్ఐ రమేష్

మంథని (విజయక్రాంతి): మంథని శ్రీపాద కాలనీలో గంజాయితో పట్టుబడ్డ 5 గురిపై కేసు నమోదు చేసినట్లు మంథని ఎస్ఐ రమేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. తమకు అందిన సమాచారం మేరకు ఒక వ్యక్తి నిషేధిత గాంజా అక్రమంగా కలిగి ఉన్నాడని, తమ సిబ్బందితో కలిసి స్థానిక మంథని బస్ డిపో దగ్గరికి వెళ్లి అక్కడ ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా, తన చేతిలో బ్లాక్ కలర్ తో మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అ వ్యక్తిని పట్టుకొని పరిశీలించగా అతని వద్ద గల బ్లాక్ ప్లాస్టిక్ కవర్ ఉందని, అందులో బ్లూ కలర్ కవర్ లో ఎండిపోయిన ఆకులు, పువ్వులు ఘాటైన వాసనతో కనిపించాయని, అతన్ని విచారించి అడగగా గంజాయి అని తెలిపాడు.

అతడు కుడుదుల సూర్య వర్ధన్(21) విద్యార్థి, గత కొన్ని రోజుల నుండి తనకు పరిచయస్తులైన తైడల సురేష్, పెండ్యాల సునీల్, ఆసంపల్లి తరుణ్, లక్క రవివర్మలతో కలిసి గత కొంతకాలంగా గంజాయికి అలవాటు పడి తాగుతున్నారని, గతంలో కూడా కొనుక్కొని వచ్చి తాగినామని తెలిపారని, వారు తల కొన్ని రూపాయలు జమ చేసి ఈ డబ్బులతో మహారాష్ట్రలోని చంద్రపూర్ కి వెళ్లి కార్తిక్ అనే వ్యక్తి దగ్గర గంజాయిని కొనుగోలు చేసి గంజాయి తాగేందుకు శ్రీపాద కాలనీకి వెళ్ళి మిగతా నాలుగు స్నేహితులతో కలిసి మంథని బస్ డిపో వద్ద ఉండగా, పోలీసులను చూసి భయపడి వారు పారిపోతుండగా వారని పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని, మంథనిలో విద్యార్థి యువత ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసిన, సేవించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.