పోలీసుల అదుపులో ఏడుగురు
అందులో నలుగురు మహిళలు
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు మాజీపూర్ వద్ద ఎస్ఓటి, స్థానిక పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా ఒక కారులో 25 కిలోల గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుంచి నగరానికి తరలిస్తున్నట్లు తెలిసింది. కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. అందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు.