calender_icon.png 12 January, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమికల్ డ్రమ్ముల వెనుక గంజాయి సంచులు!

05-08-2024 01:20:24 AM

ఒడిశా టు మహారాష్ట్ర వయా తెలంగాణ 

  1. డీసీఎం కంటెయినర్‌లో తరలిస్తున్న 803 కేజీల గంజాయి పట్టివేత 
  2. విలువ 2.94 కోట్లు.. ఐదుగురు అంతర్‌రాష్ట్ర స్మగ్లర్లు అరెస్టు 
  3. మహారాష్ట్ర నుంచి విదేశాలకు తరలించే ప్లాన్

రాజేంద్రనగర్, ఆగస్టు 4: ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు తెలంగాణ మీదుగా డీసీఎం కంటెయినర్‌లో భారీ గా గంజాయి తరలిస్తుండగా శంషాబాద్ పోలీసులు ఎస్‌ఓటీ బాలానగర్, టీజీఏఎన్‌బీ బృందంతో కలిసి పట్టుకున్నారు.

శంషాబాద్ పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగురోడ్డు మీద రూ.2,94 కోట్లు విలువ చేసే 803 కేజీల ఎండు గంజాయిని  రెడ్‌హ్యాండెడ్‌గా స్వాధీనం చేసు కొని ఐదుగురు నిందితులను పట్టుకు న్నారు. ఈ మేరకు ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కార్యాల యంలో డీసీపీ రాజేష్, ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.

ప్రధాన నిందితుడు రాము అరకు ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతడు ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తుంటాడు. సోమ్‌నాథ్ కారా అనే వ్యక్తి కమీషన్ ఏజెంట్‌తో పాటు సరుకు రవా ణా చేస్తుంటాడు. ఇతడు రాముకు సహాయకుడు. ఇతడు ఒడిశా రాష్ట్రం చిత్ర గుండ ప్రాంతానికి చెందినవాడు.

చాలా రోజులుగా ఇలా ఇతర రాష్ట్రాలకు గంజా యి సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు వీరిని పట్టు కునేందుకు ఔటర్‌రింగు రోడ్డుపై పెద్దగోల్కొండ సమీపంలో వాహనాల తనిఖీ లు చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న ఓ డీసీఎం కంటెయినర్‌ను పరిశీలించారు. అందులో ముందు భాగం లో డ్రమ్ములు ఉండగా వెనుక గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈమేరకు 803 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురిని అరెస్టు చేసి శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. సోమ్‌నాథ్ కారా, హరాడే సంజీవ్ విట్టల్‌రెడ్డి, జాగసున, సంజీవ్ కుమార్ హోలప్ప ఒకారేతోపాటు సునీల్ కోస్లా ను అరెస్టు చేశారు. డీసీఎం కంటెయినర్‌తోపాటు ఎర్టిగా కారు, ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 2,94,75000 ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు. సోమ్‌నాథ్ కారాను గతంలో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

మూడో నిందితుడు హరాడే సంజీవా విట్టల్ రెడ్డి డీసీఎం డ్రైవర్, యజమాని. అతని స్వస్థలం కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతం రాజోడా గ్రామం. అతను సరుకును ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలించి సురేష్ పాటిల్‌కు అంద జేస్తుంటాడు. ఐదో నిందితుడు సంజీవ్ కుమార్ హోలప్ప ఒకారే డీసీఎం డ్రైవర్. కర్ణాటక రాష్ట్రం బసవ కల్యాణ్ ప్రాంతవాసి. సునీల్ కోస్లా ఒడిషా రాష్ట్రం మల్కాన్‌గిరి నిలకంబేరు నివాసి.

ఇతడు సోమ్‌నాథ కారాకు సహాయకుడు. ఏడో నిందితుడు జాగ సునా ఒడిషా రాష్ట్ర వాసి. ఇతడు కూ డా సోమ్‌నాథ కారాకు సహాయకుడు. సోమ్‌నాథ ఖారా రాము ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడు. రాము ప్రధాన గంజాయి సరఫరాదారుడు. అరకు నుంచి వాహనాల ద్వారా తరలిస్తుంటాడు. నిందితులంతా ఓ జట్టుగా ఏర్పడి గంజాయి రవాణా చేసి భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.

సోమ్‌నాథ్ ఒక్కో ట్రిప్‌కు రూ.3 లక్షలు వసూలు చేసేవా డు. ప్రధాన నిందితుడు రాముతోపాటు సురేష్ పరారీలో ఉన్నట్లు డీసీపీలు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కంటెయినర్ ద్వారా  గంజా యి తరలించడం ఇదే మొదటిసారి అని పో లీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు త్వరలో సైబరాబాద్ సీపీ ద్వారా రివార్డులు అందిస్తామని డీసీపీలు రాజేష్, శ్రీనివాస్ పేర్కొన్నారు.  

గంజాయి, డ్రగ్స్ సమాచారం ఇవ్వండి

ఎవరైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీలు శ్రీనివాస్, రాజేష్ సూచించారు. డ్రగ్స్, గంజాయికి బానిస అయితే జీవితాలు నాశనం అవుతా యన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.