calender_icon.png 23 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మాకు కెనిన్ షాక్

29-08-2024 12:53:49 AM

  1. స్వియాటెక్, రిబాకినా జోరు 
  2. అల్కారాజ్ ముందంజ.. సిట్సిపాస్‌కు షాక్ 
  3. యూఎస్ ఓపెన్

న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో స్వియాటెక్ (పోలండ్) 6 7 (8/6) తేడాతో అన్‌సీడెడ్ క్రీడాకారిణి రాఖీమోవా (రష్యా) సునాయాస విజయాన్ని అందుకుంది. మిగిలిన సింగిల్స్‌లో 6వ సీడ్ పెగులా (అమెరికా) 6 6 తేడాతో రోజర్స్ (అమెరికా)పై, ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6 7 (7/1) తేడాతో ఐవా (ఆస్ట్రేలియా)పై విజయాలు సాధించారు.

2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ అయిన ఎమ్మా రాడుకానుకు సోఫీ కెనిన్ షాక్ ఇచ్చింది. తొలి రౌండ్‌లో కెనిన్ 6 3 6 రాడుకానుపై విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్‌లో 6 ఏస్‌లు సంధించిన కెనిన్ 45 విన్నర్లు కొట్టింది. కేవలం 24 విన్నర్లకే పరిమితమైన రాడుకాను మూడు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. మాజీ చాంపియన్ నవోమి ఒసాకా పదో సీడ్ ఒస్టాపెంకొను మట్టికరిపించింది. తొలి రౌండ్‌లో ఒసాకా (జపాన్) 6 6 తేడాతో ఒస్టాపెంకొపై వరుస సెట్లలో విజయాన్ని అందుకుంది.

చెమటోడ్చిన అల్కారాజ్..

పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కారాజ్ తొలి రౌండ్‌ను చెమటోడ్చి నెగ్గాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన స్పెయిన్ వీరుడికి యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే లిటూ రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యాడు. తొలి రౌండ్‌లో అల్కరాజ్ (స్పెయిన్) 6 4 6 6 తేడాతో లి టూ (ఆస్ట్రేలియా)పై కష్టపడి నెగ్గాడు. దాదాపు 3 గంటల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను నెగ్గిన అల్కరాజ్ అక్కడి నుంచి ఒక్కో సెట్ నెగ్గడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. లిటూ ధీటుగా ఆడడంతో ఒక దశలో అల్కారాజ్ వెనుకబడినట్లే అనిపించింది.  కానీ మూడో సెట్ నుంచి అల్కారాజ్ ఫుంజుకున్నాడు.

మ్యాచ్‌లో ఎనిమిది ఏస్‌లు సంధించగా.. లిటూ ఆరు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అల్కారాజ్‌కు ఇది వరుసగా 15వ విజయం కావడం విశేషం. ఇక నిషేధిత స్టెరాయిడ్ వాడి వార్తల్లో నిలిచిన ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) టోర్నీని ఘనంగా ఆరంభించాడు. తొలి రౌండ్‌లో సిన్నర్  2 6 6 6 తేడాతో మెక్‌డొనాల్డ్ (అమెరికా) మీద విజయం సాధించాడు. మ్యాచ్‌లో సిన్నర్ 11 ఏస్‌లతో పాటు 38 విన్నర్లు సంధించాడు. 4 ఏస్‌లకే పరిమితమైన మెక్‌డొనాల్డ్  ఆరు డబుల్ ఫాల్ట్స్ నమోదు చేశాడు.మిగిలిన మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ మెద్వెదెవ్  సెర్బియాకు చెందిన లజోవిక్‌పై విజయం సాధించగా.. 11వ సీడ్ సిట్సిపాస్‌కు ఆస్ట్రేలియా ఆటగాడు కొక్కినాస్ షాకిచ్చాడు. పదో సీడ్ మినౌర్ (ఆస్ట్రేలియా) 6 6 5 6 తేడాతో అన్‌సీడెడ్ గిరాన్‌పై  అతికష్టం మీద నెగ్గాడు.