26-04-2025 09:51:03 PM
సిరిసిల్ల,(విజయక్రాంతి): జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వేములవాడలోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ... అమాయకులపై దాడులు జరపడం చాలా బాధాకరమన్నారు. కాశ్మీర్ లోని ఉగ్రదాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నామన్నారు.
దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. కేంద్రం ఎటువంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతు, మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట సీనియర్ నాయకులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, తదితరులు ఉన్నారు.