calender_icon.png 7 May, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ..

25-04-2025 08:20:56 PM

హైదరాబాద్: జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగినా ఉగ్రదాడి(Pahalgam Terror Attack)ని నిరసిస్తూ హైదరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీని చేపట్టారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(AIMIM party chief Asaduddin Owaisi) పాల్గొన్నారు. అలాగే భారత్ సమ్మిట్ కు వచ్చినా విదేశీ ప్రతినిధులు, నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొని పహల్గాం మృతులకు సంతాపాన్ని తెలియజేశారు.