24-04-2025 02:36:59 PM
మంథని లో కోవ్వత్తుల ర్యాలీలో పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని,(విజయక్రాంతి): జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గం పర్యాటక ప్రాంతానికి వచ్చిన టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి జిహాధిలా ఉగ్రదాడిలో చనిపోయిన హింధు పర్యాటకుల ఆత్మ శాంతి చేకూరలని రెండు నిమిషాలు మౌనం పాటించి అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి సౌదీ అరేబియా ప్రభుత్వంతో రక్షణ ఒప్పందహాలు కుదుర్చుకుంటున్న సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు భారత్ లో పర్యటన చేస్తున్న సమయంలో పాకిస్థాన్ ఓర్వలేనితనంతో భారత సైనికుల వేషంలో ఉగ్రవాదులని పంపించి పర్యాటక ప్రాంతానికి వచ్చిన పర్యటకులపై మత వివక్షత చూపుతూ ముస్లిమేతరులైన ప్రతి ఒక్క పర్యటకుణ్ణి అత్యంత క్రూరంగా, చిన్న పిల్లలనికూడ చూడకుండా 28 మందిని కాల్చి హతమార్చారని అవేదన వ్యక్తం చేశారు.
ఈ దాడిని భారత ప్రభుత్వం గతంలో జరిగిన పులవమ గటనకు ఎ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్ జరిపి 300 మంది కిపైగా ఉగ్రవాదులని హతమార్చిందో ధానికి రెట్టింపు దాడి చేస్తూ ఉగ్రవాదుల మూలాలను సైతం నాశనం చేస్తూ కూకటి వేళ్ళతో సహ కూల్చి వేస్తుందనడంలో భారత సైన్యం పై నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా నాయకులు పోతరవేని క్రాంతి కుమార్, రాష్ట్ర నాయకులు సత్యప్రకాష్, మండల, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.