28-04-2025 01:41:18 AM
మేడ్చల్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): పహెల్గంలో ఉగ్రవాదులు కాల్చి చంపిన వారి ఆత్మకు శాంతి కలగాలని మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌడవెల్లి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉదండపురం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్, మల్లేష్ గౌడ్, నాయకులు సద్ది ప్రకాష్ రెడ్డి, రేపు రాజు తదితరులు పాల్గొన్నారు.