calender_icon.png 29 March, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాస్టర్ మృతికి నివాళిగా క్యాండిల్ లైట్ ర్యాలీ

26-03-2025 08:19:55 PM

కాటారం (విజయక్రాంతి): కాటారం డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు కలిసి ఇటీవల అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాలకు నివాళిగా గారేపల్లి అంబేద్కర్ చౌక్ వద్ద క్యాండిల్ లైట్ ప్రదర్శన చేసారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. కాటారం డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ డేవిడ్ మార్క్ మాట్లాడుతూ... పాస్టర్ ప్రవీణ్ మృతి క్రైస్తవులకు తీరని లోటని అన్నారు.

ప్రవీణ్ మరణం చుట్టూ ఉన్న అనుమానాలను ప్రభుత్వం వెంటనే విచారణ చేసి, దీని వెనుక ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉంటే వారిని కఠినంగా శిక్షించి, క్రైస్తవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పాస్టర్ కమిటీ సభ్యులు పాస్టర్లు డేవిడ్ మార్క్, బన్సిలాల్, ప్రకాష్, ఐజాక్, జీవరతన్నం, దానియేలు, కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సబ్ డివిజన్ ఇన్చార్జి బ్రదర్ ప్రభుదాస్ సుందిళ్ళ, 5 మండలాల పాస్టర్ల కమిటీ అధ్యక్షులు, సంఘ పెద్దలు, యూత్ పాల్గొన్నారు.