24-04-2025 10:37:06 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): పహల్గాంలో ఉగ్ర మూకల చేతిలో మృత్యువాత పడ్డ హిందువుల ఆత్మకు శాంతి కలగాలని జిన్నారం మండలం సోలక్ పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వివేకానంద విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి సంతాపం ప్రకటించారు. ఉగ్రముకలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.