24-04-2025 10:43:57 PM
కంగ్టి: జమ్మూ కాశ్మీర్ లో పహల్గం యాత్రికులపై ఉగ్రవాదుల దాడిలో 27 మంది యాత్రికుల విచక్షణ రహితంగా కాల్పుల జరిపిన ఘటనపై వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి, సంతాపాన్ని తెలియపరుస్తూ గురువారం సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంగ్టిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ కూడలి నుండి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విహార యాత్ర కు వెళ్లిన యాత్రికులపై టెర్రరిస్టులు కాల్పులు జరపడం క్షమించరాని నేరమన్నారు. మతం పేరుతో ఉగ్రవాద దాడులకు పాల్పడే వారిని క్షమించరాదని వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. కాల్పులలో మరణించిన వారికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పండరి, సన్నీ, రాజు, కృష్ణ, నగేష్, శివానంద్, అంజిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, సిద్దారెడ్డి, సంతోష్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.