23-04-2025 08:39:49 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాలోజివాడి గ్రామంలో బుధవారం రాత్రి ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంగళవారం పహల్గమ్ లో టూరిస్టుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఇలాంటి దాడులు దేశంలో జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతి మొత్తం ఐక్యంగా ఉండి దేశానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.