calender_icon.png 27 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గామ్ హత్యాకాండను నిరసిస్తూ చర్లలో కొవ్వొత్తుల ర్యాలీ

26-04-2025 10:47:17 PM

చర్ల (విజయక్రాంతి): హిందు ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పహల్గామ్ టెర్రరిస్టుల మారణకాండను నిరసిస్తూ శనివారం రాత్రి చర్ల మండలంలో వేలాదిగా కొవ్వొత్తులు పట్టుకుని హిందూ సనాతన ధర్మాన్ని చాటి చెబుతూ భారీ ర్యాలీని నిర్వహించారు. కాశ్మీర్ వద్ద పహాల్గమ్ దాడిలో మరణించిన 28 మంది హిందువుల ఆత్మ శాంతి కోసం అలాగే హిందువులకు రక్షణ కోసం, హిందువుల ఐక్యత చాటేందుకు ఖబర్దార్ పాకిస్తాన్ అంటూ పరమత సహనం స్టార్ట్ ఎందుకు భారీ ర్యాలీలో వేలాదిగా పాల్గొన్నారు, హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ పాకిస్థానీ ఉగ్రవాదులు మతోన్మాదులు చేసిన పనిని ఖండించారు. ఈ ర్యాలీ ఆయిల్ బంక్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి చర్ల నలుమూలల ఈ ర్యాలీ కొనసాగింది. పాకిస్తాన్ ఉగ్రవాద విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమంలో వేలాదిగా  ప్రజలు పాల్గొన్నారు.