calender_icon.png 26 April, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ

25-04-2025 11:09:03 PM

చిలుకూరు: జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ, చిలుకూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో సిపిఐ భవన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ... పాక్  కవ్వింపు చర్యలకు భారతదేశం భయపడేది లేదని, పాక్ పేరిత ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిపై తక్షణమే ప్రపంచ దేశాలు స్పందించి పాకిస్థాన్ ను ప్రపంచ పటంలోని కనుమరుగయ్య వరకు తుది మట్టించాలని అన్నారు.

ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దేశం మొత్తం ఏకతాటిపై ఉండాలని దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, అనే తారతమ్యాలు లేకుండా ముక్తకంఠంతో మనమంతా భారతీయులం అనే నినాదంపై ఒకటై ఉండి పాకిస్తాన్ పిరికి చర్యలకు భారతదేశం భయపడదనే సంకేతం ప్రపంచ దేశాలకు ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మండవ  వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ కార్యదర్శులు షేక్ సాహేబలి, చిలువేరు ఆంజనేయులు, చేపూరి కొండలు, దొడ్డ వెంకటయ్య, పిల్లుట్ల కనకయ్య, సిరాపురపు శ్రీను, బాలెబోయిన రాంబాబు, కస్తూరి సైదులు, కొడారు శ్రీను, అనంతుల రాము, పుట్టపాక అంజయ్య, కొండ వెంకయ్య, షేక్ కన్నం సాహెబ్, బాల బోయిన రవి, మండవ ఉపేందర్, మాదారపు లక్ష్మయ్య, బొడ్డు కాశయ్య, మాదారపు కొండలు, ముక్క వీరబాబు, మండవ రాంబాబు, గడ్డం వెంకటేశ్వర్లు, మాదారపు కొండలు, కైలాసపు ఏడుకొండలు, మాచర్ల వెంకటి, పూల వాసు, తదితరులు పాల్గొన్నారు.