25-04-2025 11:04:33 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రామకృష్ణాపూర్ పట్టణంలో శుక్రవారం సిపిఐ శ్రేణులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ... పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని మండిపడ్డారు. అందరం సంఘటితంగా ఉండే సమయం అని పేర్కొన్నారు. దాడిలో చనిపోయిన వారికి కొవ్వొత్తుల నివాళులర్పించడం జరిగింది. పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్రం వైఫల్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందిని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ ఆరోపించారు.
అనంతరం వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వనం సత్య నారాయణ, నక్క వెంకటస్వామి, కాదండీ సాంబయ్య, మామిడి గోపి, ఎగుడ మొండి, సిర్ల ముకుందరేడ్డి, కస్తూరి మల్లారెడ్డి, గంగాదరి మల్లయ్య, బోయపోతుల కొమురయ్య, మోతుకుల రాజు, అన్నం శ్రీనివాస్, మా దాస్ శంకర్, గొడిసెల గురువయ్య, శ్రీకాంత్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.