జీవన్‌రెడ్డి ఆశీస్సులు తీసుకున్న నరేందర్‌రెడ్డి
జగిత్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని, శాసన మండలిలో పట్టభద్రుల గొంతు వినిపి స్తానని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. జగిత్యాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడు తూ.. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను న డుపుతున్నానని తెలిపా రు. విద్యార్థుల పేరెంట్స్ సూచనల మేరకు పట్టభద్రు ల ఎమ్మెల్సీగా పోటీ చేయా లనే ఆలోచన ఉందని తెలిపారు. ఏ పార్టీకి సంబం ధం లేకుండా ఎన్రోల్‌మెంట్ ప్రారంభించానని చెప్పారు. స్వ తంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటానని చెప్పారు.