calender_icon.png 18 January, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్యాలను సమర్ధవంతంగా సాధించే అభ్యర్థులను గెలిపించాలి

18-01-2025 01:00:07 PM

విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్నికల ప్రచారంలో కందుకూరి శివప్రసాద్...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): లక్ష్యాలను సమర్ధవంతంగా సాధించే అభ్యర్థులను గెలిపించాలని కొత్తగూడెం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా పోటీ చేసే అభ్యర్థి కందుకూరి శివప్రసాద్ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని వివిధ వార్డుల్లోని విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులను కలిసి ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఈ నెల 19న జరిగే ఎన్నికల్లో ఇల్లు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు అధ్యక్షులుగా కందుకూరి శివప్రసాద్, ఉపాధ్యక్షులుగా గుంటుపల్లి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా పొన్నోజు ప్రేమాచారి, సంయుక్త కార్యదర్శిగా రాచమళ్ళ వేమనాచారి, కోశాధికారిగా కాగితపు నవీన్ కుమార్ పోటీలో ఉన్నారని తెలిపారు.

తన అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిని ఆయన వివరించారు. సంఘానికి ఆదాయ మార్గాలను విస్తృత పరిచి, సంఘ ఆదాయాన్ని పెంచి, సంఘ శ్రేయస్సుకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. సభ్యులకు మెరుగైన సేవలు చేస్తూ, విరాళాల కోసం ఇబ్బంది పెట్టకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. నిజాయితీ, కార్యదక్షత, సంఘ సేవ చేసే విధంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సంఘ సేవతో పాటు సమాజ సేవ కూడా చేశామని వివరించారు. కరోనా సమయంలో ఉచిత వైద్య సహాయంతో పాటు, ఉచిత మందుల పంపిణీ చేశామని తెలిపారు. సేవ కార్యక్రమాల నిర్వహణ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల సద్వినియోగంపై విశ్వబ్రాహ్మణులందరు ఒకే కుటంబం, ఒకే ఇల్లు అని చాటేందుకు ఇల్లు గుర్తును గుర్తుంచుకొని ఓటు వేయమని కోరారు. ఈ ప్రచారంలో పలువురు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.