calender_icon.png 6 February, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

06-02-2025 08:05:49 PM

అదనపు కలెక్టర్ దీపక్ తివారి...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ (టాస్క్) కేంద్రంలో అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్ ను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో అందిస్తున్న నైపుణ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శిక్షణ కొరకు నమోదు చేసుకున్న అభ్యర్థులు ఏకాగ్రతతో శిక్షణలో అందిస్తున్న అంశాలను నేర్చుకోవాలని, కేంద్రంలో పొందిన శిక్షణను వినియోగించుకుని భవిష్యత్తులో రాణించాలని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టాస్క్ మేనేజర్ సాయి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.