calender_icon.png 6 January, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కాంబినేషన్‌తో క్యాన్సర్

26-12-2024 12:00:00 AM

మీకు మద్యం తర్వాత సిగరెట్ తాగే అలవాటు ఉందా.. అయితే వెంటనే ఆ అలవాటును మానుకోండి. ఈ రెండింటి కలయిక చాలా ప్రమాదకరమని హెల్త్ సర్వేలు చెబుతున్నాయి. ఆల్కహాల్‌తో పాటు సిగరెట్ తాగడం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. వారానికి 750 మిల్లీలీటర్ల ఆల్కహాల్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. అయితే రెండూ కలిసి తీసుకుంటే నోరు, గొంతు అనారోగ్య సమస్యలు తలెత్తి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేకాదు.. గుండె, రక్త ప్రసరణ లాంటి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అయితే సహజంగానే ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనికి ధూమపానం తోడైతే మరింత ప్రమాదంగా మారుతుంది. ఒక్కోసారి ఈ అలవాటు గర్భాశయ క్యాన్సర్‌కు దారితీయొచ్చు.