calender_icon.png 8 October, 2024 | 5:27 PM

టాటూ వల్ల క్యాన్సర్?

08-10-2024 12:00:00 AM

ఈరోజుల్లో యువతకు టాటూలు వేసుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారింది. ఒకరినొకరు చూసుకుంటూ ఇష్టం వచ్చిన చోట టాటూలు వేయించుకుంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. టాటూ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మ క్యాన్సర్, బ్లెడ్ క్యాన్సర్లు మొదలైన వివిధ క్యాన్సర్లకు టాటూలు ప్రమాద కారకంగా ఉన్నాయి.

స్వీడిష్ నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం 11,905 మంది టాటూ వేయించుకున్నవారిలో 21 శాతం లింఫోమా పెరిగిందని వెల్లడించింది. టాటూ ఎక్స్‌పోజర్‌తో సంబంధం ఉన్న లింఫోమా రకం ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది.  లింఫోమా అనేది ఒకరకమైన క్యాన్సర్. టాటూ వేయించుకున్న కొన్ని వారాల వ్యవధిలోనే చర్మంలోని రోగనిరోధక కణాలు టాటూ ఇంక్‌లోని రసాయనాలకు ప్రతిస్పందిస్తాయి.

సిరా శరీర కణాల్లోకి వెళ్లి వాపుకు దారితీస్తుందని కొందరు నిపుణులు వెల్లడించారు. ఈ సిరాల్లో కొన్ని లోహాలు ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ద్వారా టాటూ ఇంక్‌లోని కొన్ని రసాయనాలను క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.