calender_icon.png 20 November, 2024 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలు కావాలి

17-11-2024 12:00:00 AM

నేడు మన దేశంలో ప్రతీ వందమందిలో పదిమంది క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. క్యాన్స ర్ ప్రాణాంతక వ్యాధి. వివిధ కారణాలు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఒత్తిళ్ల వల్ల అనేకమంది తమకు తెలియకుం డానే దీని బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స చేయవచ్చునని వైద్యులు అంటున్నారు. పేదలు, ఆర్థికంగా వెనుకపడ్డ వారు ఈ మహమ్మారి సోకితే డబ్బులు చెల్లించే స్థోమత లేక మృత్యువాత పడవలసి వస్తుంది. కనుక, ప్రతీ జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ, పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వమే గ్రామాల వారీగా క్యాన్సర్ టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వాలి.

- కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా