calender_icon.png 13 March, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందితే పూర్తిగా నిర్మూలించవచ్చు

13-03-2025 01:05:27 AM

బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ..

ముషీరాబాద్,(విజయక్రాంతి): క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందితే పూర్తిగా నిర్మూలించవచ్చని బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహ(BRS Youth Leaders Muta Jai Simha) అన్నారు. ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీలోని బ్లూ బర్డ్స్ హైస్కూల్లో ఎంజేఆర్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బ్రెస్ట్ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ముఠా చేసి మాట్లాడుతూ మహిళలు కుటుంబ బాధితులతో పాటు ఆరోగ్యం పై సద్ధ వహించాలన్నారు బ్రెస్ట్ క్యాన్సర్ ను నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు.

ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళ లు క్యాన్సర్ వ్యాధిపట్ల ఆందోళన చెందకుండా సంబంధిత డాక్టర్లను సంప్రదించి వైద్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూ బర్డ్స్ హైస్కూల్ కరస్పాండెంట్ మనోజ్ కుమార్, డాక్టర్ యోక్షిత, ముషీరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పూస గోరఖ్నాథ్, దీన్ దయాల్ రెడ్డి, సత్యనారాయణ బాబు, రాజేందర్, శ్రీకాంత్ యాదవ్, టీఆర్ గోవింద్, బీజేవైఎం నగర కార్య దర్శి అనిల్ కుమార్, ఎంజెఆర్ క్యాన్సర్ క్లీనింగ్ రీజినల్ సెంటర్ అధ్యక్ష కార్యదర్శిలు మన్మిత్ జాగి, సవిత ప్రేమ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.