calender_icon.png 23 December, 2024 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతో క్యాన్సర్‌ను జయించొచ్చు

07-10-2024 02:33:34 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

శేరిలింగంపల్లి, అక్టోబర్ 6: అవగాహనతో క్యాన్సర్‌ను జయించొచ్చని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ క్వాంబియంట్ గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రన్ ఫర్ గ్రేస్ ఫర్ లైఫ్ నినాదంతో గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ రన్ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారి దేశంలో లక్షలాది మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని, అవగాహనతో వ్యాధి కట్టడికి అందరూ కలిసి రావాలని రన్‌లో పాల్గొన్న వారికి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభు త్వం డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సేకరిస్తుందని, తద్వారా వ్యాధి కట్టడికి కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రేస్ ఫౌండేషన్ ప్రతినిధులు చినబాబు సుంకపల్లి, రన్నర్స్ తదితరులు పాల్గొన్నారు.