calender_icon.png 5 February, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు

04-02-2025 11:32:16 PM

పాల్వంచ (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ బాలికల కళాశాలలో మంగళవారం క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పాల్వంచ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజిత్ ముషారఫ్ పాల్గొని పిల్లలకు క్యాన్సర్ లో రకాలు వాటి లక్షణాలు క్యాన్సర్ ఏ విధంగా గుర్తించాలి. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధి నివారణకు గల వ్యాక్సిన్ ల గురించి అవగాహన కలిగే విధంగా సూచనలు విద్యార్థులకు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి, వైస్ ప్రిన్సిపల్ జ్వలిత, హెల్త్ సూపర్వైజర్ కె దైవ వీనస్, కోఆర్డినేటర్ హిమబిందు, జయ, శ్రీలక్ష్మి వాలంటీర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.