calender_icon.png 27 December, 2024 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్ ఫిన్‌సర్వ్ ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్ రద్దు

10-07-2024 05:23:49 AM

ముంబై, జూలై 9: హైదరాబాద్ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్ ఫిన్‌సర్వ్‌తో సహా రెండు ఎన్‌బీఎఫ్‌సీల (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) రిజిస్ట్రేషన్‌ను రిజర్వ్‌బ్యాంక్ రద్దు చేసింది.  లెండింగ్ కార్యకలాపాల్లో అక్రమ పద్ధతులకు పాల్పడుతు న్నాయన్న కారణంగా స్టార్ ఫిన్‌సర్వ్ ఇండి యా, ముంబైకి చెందిన పాలీటెక్స్ ఇండియాల లైసెన్సు రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. స్టార్‌ఫిన్ సర్వ్ ఎన్‌బీఎఫ్‌సీ సేవల్ని ‘ప్రోగ్‌క్యాప్’ (దేశిదేరత ఇంపాక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలోని) ద్వారా ఆఫర్ చేస్తున్నది.

పాలీటెక్స్ ఇండి యా ‘జడ్2పీ’ మొబైల్ అప్లికేషన్ (జైటెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహణలోని) ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ది. రిజిస్ట్రేషన్ రద్దుకు కారణాల్ని ఆర్బీఐ వివరిస్తూ స్టార్ ఫిన్‌సర్వ్ తన డిజిటల్ లెండింగ్ కార్యకలాపాల్లో అవుట్‌సోర్సింగ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని తెలిపింది. క్రెడిట్ అప్రయిజల్, రుణ మంజూరీ, కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ తదితర నిర్ణయాత్మక కార్య కాపాల అవుట్‌సోర్సింగ్‌లను ఆర్బీఐ తప్పుపట్టింది. స్టార్ ఫిన్‌సర్వ్ ఖాతాదారుల పూర్తి డేటాను సర్వీస్ ప్రొవైడర్‌కు ఇవ్వడం మార్గదర్శకాలకు విరుద్ధమని కేంద్ర బ్యాంక్ పేర్కొంది.

పాలీటెక్స్ కూడా కేవైసీ వెరిఫికేషన్, క్రెడిట్ అప్రయిజల్, రుణ పంపిణీ, రుణ రికవరీ, రుణగ్రహీతలను అనుసరించ డం, ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలు వంటి ప్రధాన కార్యకలాపాల అవుట్‌సోర్సింగ్ మార్గదర్శకాల్ని ఉల్లంఘించినట్టు తెలిపింది. రుణ వితరణ అవుట్‌సోర్సింగ్‌కు సంబంధించి పాలీటెక్స్ ఇండియా సర్వీసు ప్రొవైడ ర్ నుంచి నిర్ణీత ఫీజును పొందుతున్నదని, రుణగ్రహీతల నుంచి వసూలు చేసే వడ్డీ సర్వీస్ ప్రొవైడర్ సంపాదిస్తున్నదని ఆర్బీఐ వివరించింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను రద్దు చేసినందున ఈ రెండు కంపెనీలు ఎటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారం చేయరాదని పేర్కొంది.