calender_icon.png 12 January, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి హత్యకేసులో శిక్ష రద్దు

04-08-2024 01:58:58 AM

11 ఏళ్ల తరువాత నిర్దోషిగా విడుదల

తీర్పు చెప్పిన హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): తల్లిని హత్య చేశాడన్న కేసులో జైలుకు వెళ్లి 11 ఏళ్ల తరువాత హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు. మెదక్ జిల్లా దుబ్బా క మండలం పెద్దగుండవల్లికి చెందిన పెద్దగుండేల పోచయ్యకి యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవ రి 1న అందిన ఫిర్యాదు మేరకు 80 ఏళ్ల తల్లిని టవల్‌తో గొంతు నులిమి చంపి, తరువాత సీతాఫలం చెట్టుకు ఉరి వేసి చంపా డన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

తల్లి అనారోగ్యంతో విసిగిపోయి, తనను చూసుకోలేక చంపేశానని నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగ పత్రం దాఖలు చేశారు. దీనిపై సిద్దిపేట కోర్టు విచారణ చేపట్టి హత్య, సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై 2015 జనవరి 12న యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పోచయ్య హైకోర్టులో అప్పీ లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే సురేందర్, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.

ఈ కేసులో అదే గ్రామానికి చెందిన సాక్షులు మాట మార్చారని, నిందితుడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని, కేవలం డాక్టరు, దర్యాప్తు అధికారి సాక్ష్యాలతో శిక్ష విధించడం సరికాదని తెలిపింది. డాక్టరు సాక్ష్యం ప్రధానమని, ఒకవేళ అది ఆత్మహత్య అయితే హత్య అన్న ప్రశ్న తలెత్తదంది. హత్య కారణంగానే వద్ధురాలు మతి చెందినట్లు ప్రాసిక్యూషన్ నిర్ధారించాల్సి ఉందని తెలిపింది. ఇతర ఆధారాలు లేనపుడు ప్రత్యక్ష సాక్షులపై ఆధారపడాలని, అయితే ఇక్కడెవ రూ లేరంది. కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు సొంత అభిప్రాయాల ను ఏర్పరచుకోజాలవని స్పష్టం చేసింది. పోచయ్యపై ఇతర కేసులు లేనట్లయితే తక్షణం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.