calender_icon.png 16 January, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ రద్దు చివరి ఆప్షనే..

09-07-2024 12:51:02 AM

  1. కొద్దిమంది కోసం అందరినీ ఇబ్బంది పెట్టొద్దు
  2. లీకైన పేపర్ ఎంత మందికి చేరింది?
  3. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు ప్రశ్న
  4. మూడు పారామితుల ప్రకారం నీట్ రీటెస్ట్!

న్యూఢిల్లీ, జూలై 8: నీట్ యూజీ పేపర్ లీకైనట్టు స్పష్టమైన ఆధారాలున్నాయని, కా నీ ఇప్పుడు పరీక్ష మొత్తాన్ని రద్దుచేయటం కొత్త సమస్యలకు దారితీస్తుందని సుప్రీంకో ర్టు అభిప్రాయపడింది. లీకైన పేపర్ ఎంతమంది విద్యార్థులకు చేరిందో తెలుసు కోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించింది. ఒకవేళ ఆ ఆధారాలు లభించక పోయినా ఇప్పుడు నీట్ పరీక్షను పూర్తిగా రద్దుచేయటం మంచి పని కాదని పేర్కొన్నది. కొద్ది మంది తప్పు చేసినందుకు ౨౩ లక్షల మందిని శిక్షించటం సరికాదని పేర్కొన్నది.

నీట్ యూజీ పరీక్షను రద్దుచేయాలని దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సో మవారం విచారణ చేపట్టింది. ఒక వేళ నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాల్సి వస్తే మూడు పారామితుల ఆధారంగా నిర్వహించాలని కోర్టు సూచించింది. లీకైన పేపర్ ఎంత మం దికి చేరిందనేది గుర్తించాల్సి ఉంటుందని సు ప్రీం అభిప్రాయపడింది. ఒక వేళ వారిని గుర్తించడం సాధ్యం కాని పక్షంలో పరీక్ష మరలా నిర్వహించాలని.. గుర్తిస్తే తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిం ది. ఇది 23 లక్షల మంది విద్యార్థు ల జీవితాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నది.  

ఆ మూడు పారామితులివే.. 

మరలా రీటెస్ట్ నిర్వహించేందుకు కోర్టు మూడు పారామితులను సెట్ చేసింది. అవి 1) అసలు లీక్ అయిన పేపర్ ఎంత మంది విద్యార్థులకు చేరింది? 2) పేపర్ లీక్ పరీక్షను పూర్తిగా ప్రభావితం చేసిందా? 3) ఫ్రాడ్ చేసిన వ్యక్తులను వేరు చేయడం వీలు పడుతుందా? అనే అంశాలను పరిశీలించాలని ఎన్టీయేకు సూచించింది. నీట్ పరీక్షను మరలా నిర్వహించడం సులభం కాదని బెం చ్ అభిప్రాయపడింది. ఎంతో మంది విద్యార్థులు, వ్యయప్రయాసలకోర్చి పరీక్ష రాశారని మరలా నిర్వహిస్తే వారి శ్రమ మొత్తం వృథా అవుతుందన్నారు. తప్పు చేసిన విద్యార్థులను కేంద్రం, ఎన్టీయే గుర్తించాలని వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సీబీఐ ఆరు కేసులను కూడా నమోదు చేసిందని ఎన్టీయే  తెలపగా.. అంటే పేపర్ లీక్ అయినట్లేనని సీజేఐ రిప్లు ఇచ్చారు. షెడ్యూల్ డేట్ కంటే 10 రోజుల ముందుగానే ఎన్టీయే ఫలితాలు ప్రకటించడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. 

విచారణ వాయిదా..

ఇందుకు సంబంధించిన వాదనలను గురువారం మరలా వింటామని ధర్మాసనం కేసును గురువారానికి వాయిదా వేసింది.

రద్దు అస్సలుకే కుదరదు 

నీట్ పరీక్షను రద్దు చేయడం అస్సలుకే కుదరదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్ష లీకైనట్లు ఎక్కడ కూడా ఇంకా ఆధారాలు లభించలేదు. ఇప్పటికే ఫలితాలు కూడా ప్రకటించేశాం కాబట్టి.. రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశారు.