calender_icon.png 25 October, 2024 | 11:54 AM

ఇరిగేషన్ సిబ్బందికి సెలవులు రద్దు

02-09-2024 12:45:19 AM

  1. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాలె 
  2. చెరువులు తెగిన చోట వెంటనే రిపేర్లు 
  3. నిధులు గురించి ఆలోచన చేయవద్దు 
  4. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో నీటిపారుదల శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేసిన ట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఏఈల నుంచి సీఈల వర కు క్షేత్రస్థాయిలో ఉండి రెవెన్యూ యంత్రాంగంతో  సమన్వయం చేసుకోవాలని  సూచిం చారు.  చెరువులు, కట్టలు తెగిన చోట తక్షణ మే మరమ్మతులు చేపట్టాలని, విపత్తుల సమయంలో నిధుల గురించి ఆలోచన చేయవద్దని ఉత్తమ్ పేర్కొన్నారు.

ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో డిండి ప్రాజె క్టులో ఆరు ఫీట్ల మేర నీరు చేరిందని, ఆ జిల్లా సీఈ అజయ్ మంత్రి దృష్టికి తీసుకురాగా, ఉదయ సముద్రం నిండేలా ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో 4.70 లక్షల క్యూసెక్కులుగా ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీటిని నిలిపివేశారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌కు సాగర్ నుంచి వస్తున్న నీటిని నిలిపివేసినప్పటికి కేవలం వరద నీరే 3 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని వివరించారు. హుజూర్‌నగర్ మండలంలో దెబ్బతిన్న చెరువులు, మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూర్యాపేట జిల్లా సీఈ రమేశ్‌బాబును మంత్రి ఆదేశించారు. 

వరంగల్  జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ను అనుకున్ని ఉన్న చెరువులు దెబ్బతిన్నాయని, అధికారులు మంత్రికి వివరించగా, తక్షణమే మరమ్మతులు చేపట్టాల న్నారు. డ్యామ్‌లు, కెనాల్‌లు, కట్టలపై  దృష్టి సారించి ప్రమాదకర సంఘటలను జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.