calender_icon.png 2 November, 2024 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయసాయికి ఐసీఏఐ నోటీసులు రద్దు

31-07-2024 12:34:16 AM

హైదరాబాద్, జూలై 30 (విజయక్రాం తి): వైఎస్ జగన్ ఆస్తుల కేసులో రెండో నిందితుడు, వైసీపీ ఎంపీ వీ విజయసాయిరెడ్డికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఇచ్చిన నోటీసులను హైకోర్టు కొట్టేస్తూ తీర్పు చెప్పింది వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హాజరుకావాలని 2023 అక్టోబర్ 23న ఐసీఏఐ ఇచ్చిన నోటీసును రద్దు చేయాలని విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్ సూరేపల్లి నంద మంగళవారం తీర్పు వెలువరించారు. వైఎస్ జగన్‌తో కలిపి ఆయన కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చేలా విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారని, వృత్తిపరమైన విషయాలను నిర్లక్ష్యం చేశారనే అభియోగాలకు ఐసీఏఐ ఆధారాలను చూపలేదని తేల్చారు. 

చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉంటూ విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్‌లో డైరెక్టర్‌గా వ్యవహరించి ఆ సంస్థలో పెట్టుబడులు వచ్చేలా చేశారనేందకు ఆధారాల్లేవని పేర్కొన్నారు. ఐసీఏఐ రిజిస్టర్డ్ ఆఫీస్ చెన్నైలో ఉంది కాబట్టి అభ్యంతరాలపై మద్రాస్ హైకోర్టులో తేల్చుకో వాలని, అప్పిలేట్ అథారిటీ ఉండగా ఇక్కడ పిటిషన్ వేయడం చెల్లదన్న ఐసీఏఐ వాదన ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఐసీఏఐ నోటీసును రద్దు చేశారు.