హనుమకొండ జిల్లాలో సీనియర్ సిటిజన్ యాక్టు అమలు
భీమదేవరపల్లి, నవంబర్ 4: హనుమకొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా సీని యర్ సిటిజన్ యాక్టు అమలైంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కొడుకు పట్టిం చుకోకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కొడుక్కు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ని తహసీల్దార్ రద్దు చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముసాఫపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్యకు కొడుకు రవి ఉన్నా డు. ఆరు సంవత్సరాల క్రితం రవికి తనకున్న 4.20 ఎకరాల భూమిని గిఫ్ట్ డీడ్ చేయించా డు. ఆనాటి నుంచి తండ్రిని రవి పట్టించుకోకుండా సరిగా తిండి సైతం పెట్టడం లేదు.
దీంతో రాజకొంరయ్య హసన్‌పర్తికి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానికులు కాపాడారు. అప్పటి నుంచి హుజూరాబాద్‌లోని మిల్లులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే సీనియర్ సిటిజన్ యాక్టు గురించి తెలుసుకుని భీమదేవరపల్లి తహసీల్దార్‌ను ఆశ్రయించాడు. వెంటనే తహసీల్దార్ ఆర్డీవో కు సమాచారం అందించారు. ఆర్డీవో సూచ న మేరకు సోమవారం రవికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి రాజకొంరయ్య పేరు మీద తిరిగి రిజిస్ట్రేషన్ చేయించారు.
తహసీల్దార్ ముల్కనూర్ ఎస్సైకి ఫోన్ చేసి రాజకొంరయ్యకు ఆయన కొడుకు రవి నుంచి రక్షణ కావాలని ఎస్కార్టుగా పోలీసులను పంపించారు. రవిని ఇకపై తండ్రి జోలికి వెళ్లకుండా మందలించాలని ఆదేశాలు జారీ చేశారు.