కివీస్, ఆఫ్గన్ ఏకైక టెస్టు
నోయిడా: న్యూజిలాండ్ జట్ల మధ్య గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఐదు రోజుల టెస్ట్ రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే టెస్టు మ్యాచ్ రద్దు కావడం 91 ఏళ్లలో భారత్‌లో ఇదే తొలిసారి. మొదటి రెండు రోజులు ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడం వల్ల రద్దయిన టెస్టుకు తర్వాతి మూడు రోజులు మాత్రం వరణుడు అడ్డుగా నిలిచాడు. శుక్రవారం రోజు కూడా ఆటడం వీలు కాదని అంపైర్లు తేల్చడంతో టాస్ కూడా పడకుండానే టెస్టు మ్యాచ్‌ను రద్దు చేశారు. ‘గ్రేటర్ నోయిడాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఐదో రోజు ఆట రద్దయింది. దీంతో టెస్టు మ్యాచ్ కూడా రద్దయింది’ అని అఫ్ఘన్ క్రికెట్ బోర్డు తెలిపింది.