వరద ప్రాంతాల్లో తక్షణ సాయం అందించాలె
ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓకు పంపాలె
అత్యవసరమైతే తప్ప ప్రజల బయటకు రావద్దు
వరదలపై ప్రజలను అప్రమత్తం చేయాలె
అత్యవసర సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు కూడా వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పం పాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. రాష్ర్టంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రు లు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనర్సింహ, జూపల్లి తదితరులతో ఫోన్‌లో సమీక్షించారు.
సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. అత్యవసర పనులుంటే తప్ప ప్రజ లు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించా రు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు.
భవిష్యత్తు అవసరాలకు వరద నీరు..
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందన్నారు. ఎల్లంప ల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారని సీఎం వెల్లడించారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. నంది, గాయ త్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సీఎం సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలె..
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగ ర్ రిజర్వాయర్లలో సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించా రు. మల్లన్నసాగర్‌లో గరిష్ఠంగా 18 నుం చి 20 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామ ర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీరు నిల్వ ఉందని మంత్రి తెలిపారు. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నామ ని వెల్లడించారు.
మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తు తం 15 టీఎంసీలు ఉందన్నారు. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6,400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్‌కు తర లిస్తున్నారు. అటు రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలిం చాలని ఆదేశించారు.
అన్నపూర్ణ, రంగనాయక సాగర్లలో 7.52 టీఎంసీలు, మల్ల న్నసాగర్‌లో 50 టీఎంసీల కెపా సిటీ కాగా.. ఆదివారం నాటికి 11.43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కొండపోచ మ్మ సాగర్‌లో 15 టీఎంసీల కెపాసిటీ ఉండగా 7.91 టీఎంసీ నీళ్లున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ముందు జాగ్రత్తలు పాటించాలని అప్రమత్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని ఆదేశించారు.