calender_icon.png 2 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్‌షోర్ మైనింగ్ టెండర్లు రద్దు చేయండి

01-04-2025 02:18:13 AM

  1. ప్రధాని మోదీని లేఖలో కోరిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
  2. ఈ మైనింగ్ సముద్ర జీవాల మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన

న్యూఢిల్లీ, మార్చి 31: లోక్‌సభలో ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీ ఆఫ్‌షోర్ మైనింగ్ (సముద్ర గర్భాల్లో ఖనిజాల వెలికితీత)ను రద్దు చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్‌షో ర్ మైనింగ్‌కు ఇటీవలే కేంద్రప్రభుత్వం అనుమతి ఇస్తూ టెండర్లు ఖరారు చేసింది.

ఈ టెండర్లు రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ మైనింగ్ వల్ల సముద్రంలో ఉన్న జీవరాశి మనుగడకు ప్ర మాదం ఏర్పడనుందని ఆయ న ఆందోళన వ్యక్తం చేశా రు. ఆఫ్‌షోర్ మై నింగ్‌కు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసు కున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. ‘ఆఫ్‌షోర్ మైనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అను మతి వ్వడాన్ని నేను ఖండిస్తున్నా.

ఈ మైనిం గ్ వల్ల నష్టం జరుగుతుందని తీరప్రాంతాల ప్రజలు ఆవేదన చెందుతూ నిరసనలు తెలుపుతున్నారు. ఈ విధానం వల్ల పర్యావరణా నికి ఎంత నష్టం వాటిల్లుతుందో అంచనా వేయకుండానే అనుమతులు మం జూరు చేశారు. ఈ మైనింగ్ వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని లక్షల సంఖ్యలో జాలర్ల కు టుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా యి.’ అని లేఖలో పేర్కొన్నారు.