calender_icon.png 22 December, 2024 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయండి

08-10-2024 12:51:59 AM

కోర్టును కోరనున్న పోలీసులు

రాజేంద్రనగర్, అక్టోబర్ 7: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. తనకు నేషనల్ అవార్డు రావడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆయన రంగారె డ్డి జిల్లా కోర్టు (పోక్సో)లో పిటిషన్ వేయడంతో ఈ నెల 6 నుంచి 10 వరకు న్యాయ మూర్తి బెయిల్ మంజూరు చేశారు. షెడ్యూ ల్ ప్రకారం జానీ మాస్టర్ ఈ నెల 8న ఢిల్లీ  లో అవార్డు అందుకోవాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కమిటీ రద్దు చేసింది. జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేయడంతో ఈ మేరకు కమిటీ రద్దు అవార్డును చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, బెయిల్ మం జూరు అయినా జానీ మాస్టర్ జైలులోనే ఉన్నారు. అవార్డు రద్దు కావడంతో ఆయన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని నార్సింగి పోలీసులు కోర్టును కోరనున్నారు. 

రెగ్యులర్ పిటిషన్‌పై విచారణ వాయిదా

అయితే, జానీ మాస్టర్ తరఫున న్యాయవాది రెగ్యులర్ బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో సోమవారం పిటిషన్ వేయగా కోర్టు 9వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అవార్డు రద్దు అయిన నేపథ్యంలో తాను మధ్యంతర బెయిల్ తీసుకోనని జానీ మాస్టర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.