calender_icon.png 6 November, 2024 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపావళి వేడుకల్లో కెనడా ప్రధాని ట్రూడో

04-11-2024 01:40:14 AM

భారత్‌తో దౌత్య వివాద సమయంలో కీలక పరిణామం

న్యూఢిల్లీ, నవంబర్ 3: కెనడాలో ప్రవాస భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. ఆ విశేషాలను ట్రూడో ఎక్స్ వేదికగా పంచుకు న్నారు. కాగా భారత్‌తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేల ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోవడం విశేషం.

‘హ్యాపీ దీపావళి.. ఈ వారం వారితో సంబురాలు చేసుకున్నాను. ప్రత్యేక క్షణాలు గడపాను” అని ట్రూడో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన చేతికి కట్టుకున్న మతపరమైన తాళ్లను ఆయన వీడియోలో చూపించారు. గత కొన్ని నెలలుగా కెనడాలోని పలు దేవాలయాలను తాను సందర్శించినట్లు వెల్లడించారు.

మరోవైపు భారత్ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షం కూడా ముందుగా దీపావళి సంబురాలకు దూరంగా ఉండాలని భావించింది. ది ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కెనడా (ఓఎఫ్‌ఐసీ) పార్లమెంట్ హాల్‌లో నిర్వహించే వేడుకలకు హాజరుకానని ప్రతిపక్ష నేత పియర్రీ పాయిలీవర్ వెల్లడించారు. ఈ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో మనసు మార్చుకొని వైట్‌బైలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.